పిడుగు పడి గుడిసె దగ్ధం

పిడుగు పడి గుడిసె దగ్ధం

అన్నమయ్య: వీరబల్లి మండలం ఊట్లకుంటలో రైతు వెంకటరమణ తన పొలంలో ఏర్పాటు చేసుకున్న గుడిసెపై అర్ధరాత్రి పిడుగు పడింది. ఈ ఘటనలో గుడిసెలో నిల్వ ఉన్న వ్యవసాయ పరికరాలు, ఎరువులు దగ్ధమయ్యాయి. రైతు గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. పిడుగు పడిన సమయంలో గుడిసెలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. రైతు పొలం నుంచి ఇంటికి వెళ్లిన కొద్ది క్షణాల్లోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.