నేడు మండల కేంద్రంలో ఎమ్మెల్యే పర్యటన

MBNR: కోయిలకొండ మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని గురువారం మధ్యాహ్నం 3 గంటలకు నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి ప్రారంభించనున్నారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. అనంతరం మండలంలోని గార్లపాడ్‌లో PACS ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభిస్తారు. రైతులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.