ఇఫ్తార్ విందుకు హాజరైన ఎమ్మెల్యే కోరం
BDK: ఇల్లందు పట్టణంలోని జేకే కాలనీ సింగరేణి మైదానంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో శుక్రవారం ఇఫ్తార్ విందును ఘనంగా నిర్వహించారు. ముస్లిం సోదరులతో కలిసి ఎమ్మెల్యే ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా MLA వారికి స్వయంగా విందు వడ్డించి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్, వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.