ఆదాయ మార్గాలను పెంపొందించుకునే అంశంపై శిక్షణ
SKLM: మందస మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో బుధవారం మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించినట్లు వెలుగు ఏపీ కూర్మారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. E- నారీ, సిఆర్పిలకు శిక్షణ కార్యక్రమంలో వాటి ప్రాముఖ్యతను వివరించామన్నారు. ఆదాయ మార్గాలను పెంపొందించుకునేందుకు మహిళా సంఘాలకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలపై అవగాహన కల్పించామన్నారు.