ఆర్టీసీ ద్వారా రెవెన్యూ పెంచండి : మంత్రి పొన్నం
TG: మహాలక్ష్మీ పథకం వచ్చిన తర్వాత సంక్షోభంలో ఉన్న ఆర్టీసీ క్రమక్రమంగా లాభాల్లోకి వస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం నుంచి నెల వారిగా వస్తున్న మహాలక్ష్మి టికెట్ ఆదాయమే కాకుండా అదనపు ఆదాయంపైనా దృష్టి సాధించాలని సూచించారు. బుధవారం సచివాలయంలో మంత్రి ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.