'ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి'
SRCL: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఇంఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది విధులు, ఎన్నికల సామగ్రి పంపిణీ, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు తదితర అంశాలపై జిల్లాలోని ఆర్డీవోలు, ఎంపీడీవోలు, అధికారులతో కలెక్టరేట్‌లో ఆదివారం సమావేశాన్ని నిర్వహించారు.