అడవుల్లో 64ట్రాప్ కెమెరాల ఏర్పాటు
NLR: ఉదయగిరి అటవీశాఖ రేంజ్ పరిధిలోని 32పాయింట్లలో 64ట్రాప్ కెమెరాలు ఏర్పాట్లు చేసినట్లు రేంజ్ అధికారి బీఎస్ కుమారరాజా తెలిపారు. రేంజ్ పరిధిలోని ఆర్లపడియ, కొత్తపల్లి, రేవమ్మ చెరువు, సీతారామపురం తదితర బీట్ల పరిధిలో వీటిని అమర్చామన్నారు. వీటితో అడవుల్లో పులులు సంచారాన్ని గుర్తించవచ్చన్నారు. 20 రోజుల తరువాత కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలను ల్యాబ్‌కు పంపుతామన్నారు.