పెబ్బేర్: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్ సమీపంలో హైవేపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకుపై హైదరాబాద్ నుంచి కర్ణాటక వైపు వెళ్తున్న ఓ వ్యక్తిని ఎదురుగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. తలకు హెల్మెట్ ఉన్నా.. వాహనం బలంగా ఢీకొట్టడంతో స్పాట్లోనే చనిపోయాడు. మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.