మురళీకృష్ణ ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

SRD: కృష్ణాష్టమి సందర్భంగా సంగారెడ్డి పట్టణం గణేష్ నగర్‌లోని మురళీకృష్ణ ఆలయంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో CDC మాజీ ఛైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు నాయకులు పాల్గొన్నారు.