అండర్ బ్రిడ్జిల కింద నీరు

కృష్ణా: ఉంగుటూరు మండలంలోని పొట్టిపాడు, తేలప్రోలు, ఆత్కూర్, పెద్ద అవుటపల్లి గ్రామాల్లోని చెన్నై-కోల్‌కతా హైవేపై ఉన్న అండర్ బ్రిడ్జిల కింద వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొద్దిపాటి వర్షానికే రాకపోకలు నిలిచిపోతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతున్నారు.