‘నేను చనిపోతే దానికి మీరే బాధ్యులు’

‘నేను చనిపోతే దానికి మీరే బాధ్యులు’

తనపై అసభ్యకరమైన ట్రోల్స్, రెండో పెళ్లి గురించి వస్తోన్న ఊహాగానాలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నానని డ్యాన్సర్ జాను లిరి చెప్పింది. కొంతమంది తన జీవితంతో ఆడుకుంటున్నారని.. అలా చేయొద్దని కోరుతూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. తన కొడుకును బాగా చదివించి మంచి స్థాయిలో చూడాలని ఉందని, కానీ, ఇలాంటి నెగెటివ్ వార్తల వల్ల తాను మధ్యలోనే చనిపోతే ఇలాంటి వారే కారణమవుతారని చెప్పింది.