సమస్యలను పరిష్కరిస్తా: కార్పొరేటర్
VSP: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 48వ వార్డు కొండవాలు ప్రాంతంలో కార్పొరేటర్ గంకల కవిత అప్పారావు మంగళవారం పర్యటించారు. రోడ్లు, కాలువలు, మెట్లు, వీధి దీపాల సమస్యలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, కొన్నింటిని తక్షణమే పరిష్కరించగా మిగతావాటిపై అధికారులతో చర్చిస్తామని తెలిపారు.