VIDEO: చిన్నరావుపల్లెలో సంగీత కచేరీ
SKLM: ఎచ్చెర్ల మండలం చిన్నరావుపల్లి గ్రామంలో వెలసిన శ్రీ కోదండ రామాలయంలో శనివారం సాయంత్రం శ్రీ చరణీ సంగీత కళాక్షేత్రం శ్రీకాకుళం వారిచే సంగీత కచేరీ కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రీ రామ నవమి ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని, ఈ కార్యక్రమాన్ని తిలకించారు.