కదిరిలో హిందూ సమ్మేళనానికి ఆహ్వానం

కదిరిలో హిందూ సమ్మేళనానికి ఆహ్వానం

సత్యసాయి: శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం డిసెంబర్ 13న కదిరిలో జరుగనుంది. ప్రభుత్వ బాలికల కళాశాల మైదానంలో సాయంత్రం 4 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. హిందూ సమాజ ఐక్యత, ధర్మం పట్ల అవగాహన పెంపు లక్ష్యంగా ఈ సమ్మేళనం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. హిందూ బంధువులంతా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.