పుంగమ్మ కట్టపై ధర్నా చేపట్టిన ప్రజలు

పుంగమ్మ కట్టపై ధర్నా చేపట్టిన ప్రజలు

CTR: పుంగనూరు పుంగమ్మ కట్టపై రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నివాసితులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే సోమవారం రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. రోడ్డు పూర్తిగా దెబ్బ తినడంతో రోడ్డు మరమ్మతు పనులు అధికారులు చేపట్టారని, రెండు నెలలు గడుస్తున్నా పనులు అలాగే ఉండిపోయాయని చెప్పారు. దీంతో దుమ్ము ధూళి తీవ్రమైందని నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.