ఢిల్లీ పేలుళ్లలో తెరపైకి PAFF..!
ఢిల్లీ పేలుళ్ల ఘటనలో పీపుల్స్ యాంటీ-ఫాసిస్ట్ ఫ్రంట్(PAFF)కు సంబంధం ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇది జైషే మొహమ్మద్ నీడ సంస్థగా జమ్మూకశ్మీర్‌లో పని చేస్తున్నట్లు గుర్తించారు. దీనిని తన్వీర్ రాత్రే నాయకత్వం వహిస్తున్నాడని అయితే అతని అసలు పేరు అది కాదని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. డా. ఆదిల్ అహ్మదే తన్వీర్ అయి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నాయి.