VIDEO: 'సోలార్ ప్రాజెక్టుపై అధికారులు స్పష్టత ఇవ్వాలి'
మచిలీపట్నంలో ఆక్వా రైతులకు ఇబ్బందులు కలుగుతున్నాయని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. దక్షిణ మండలంలో సోలార్ ప్లాంట్ పేరుతో చెరువుల సాగును అడ్డుకుంటున్నారని తెలిపారు. చెరువుల మరమ్మతులు కూడా ఆపుతున్నారని, 700–800 ఎకరాల్లో సోలార్ ప్రాజెక్టుపై అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేయకపోతే రెవెన్యూ కార్యాలయం ముట్టడిస్తామన్నారు.