పిడుగు పాటుకు ఇద్దరు మృతి

SRCL: పిడుగుపాటుతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. తంగళ్లపల్లి మండలం ఇందిరానగర్ గ్రామంలోని భరత్ నగర్ లో రుద్రారపు చంద్రయ్య అనే రైతు తన పొలం వద్ద పనులు చేసుకుంటుండగా పిడుగు పడి అక్కడిక్కడే మృతి చెందాడు. వేములవాడలోని శాత్రాజ్ పల్లిలో పిడుగుపాటుతో కంబల్ల శ్రీనివాస్ (30) అనే వ్యక్తి మృతి చెందగా, మరో నలుగురు గాయాలపాలయ్యారు.