'పర్వతగిరిలో చెస్ బోర్డుల పంపిణీ'

'పర్వతగిరిలో చెస్ బోర్డుల పంపిణీ'

WGL: పర్వతగిరి మండల కేంద్రంలోని పాఠశాలలో చెస్ నెట్వర్క్, ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం చెస్ బోర్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రతిమ ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ బోయినపల్లి హరిణి ముఖ్య అతిథిగా హాజరై మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెస్ బోర్డులను పంపిణీ చేశారు. చెస్ మేధో క్రీడగా విద్యార్థుల్లో ఏకాగ్రత, వ్యూహరచన పెంపొందిస్తుందని ఆమె తెలిపారు.