పోలీసు అమరవీరుల వారోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం

పోలీసు అమరవీరుల వారోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం

ADB: జిల్లాలో అమరులైన పోలీసుల జ్ఞాపకార్థం నిర్వహించే ఫ్లాగ్ డే (పోలీసు అమరవీరుల దినోత్సవం) వారోత్సవాలను ఈ నెల 21 నుంచి 24 వరకు ఘనంగా నిర్వహించాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. 21న హెడ్ క్వార్టర్స్‌లో అమరవీరుల స్తూపం వద్ద కలెక్టర్, ఎస్పీ నివాళులర్పిస్తారు. 22న మెగా రక్తదానం, 23న ఓపెన్ హౌస్, సైకిల్ ర్యాలీ, 24న 5కే రన్ ఉంటుందన్నారు.