అప్పుల బాధతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.!
HNK: దామెర మండలం పసరగొండ గ్రామానికి చెందిన తీగుళ్ల చేరాలు (45) ఆటో డ్రైవర్ బుధవారం అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఇంటిని, బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న ఆయనపై రుణ సంస్థల ఒత్తిడి పెరగడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.