ఉచిత నైపుణ్యాభివృద్ధిని సద్వినియోగం చేసుకోండి: మంత్రి
సత్యపాయి: పెనుకొండలోని శ్రీ పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్కిల్ హబ్‌లో ఉచిత నైపుణ్యాభివృద్ధి కోర్సులకు దరఖాస్తులు చేసుకోవాలని మంత్రి సవిత ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం ఈనెల 15వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు. మూడు కోర్సులు అందుబాటులో ఉన్నాయని, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీటెక్ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.