రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ స్పాట్ డెడ్

రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ స్పాట్ డెడ్

ప్రకాశం: దర్శి మండలం సింగన్నపాలెం వద్ద ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఐస్‌క్రీమ్ తీసుకెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడడంతో డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందాడు. మృతదేహం వాహనం క్యాబిన్‌లో ఇరుక్కుపోవడంతో అద్దాలను పగలగొట్టి స్థానికులు బయటకు తీశారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలవడంతో స్థానికులు వెంటనే దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.