VIDEO: ఘోర ప్రమాదం.. తృటిలో తప్పిన ప్రాణాపాయం

VIDEO: ఘోర ప్రమాదం.. తృటిలో తప్పిన ప్రాణాపాయం

SRPT: సూర్యాపేట మండల పరిధిలోని బాలెంల నాయరా పెట్రోల్ బంక్ సమీపంలో శనివారం సాయంత్రం పెను ప్రమాదం తప్పింది. అతివేగంగా వస్తున్న టాటా ఏస్ వాహనం, బస్సును ఓవర్ టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులోని సేఫ్టీ బెలూన్లు (ఎయిర్ బ్యాగ్స్) సకాలంలో తెరుచుకోవడంతో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు.