అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ సీజ్

అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ సీజ్

NZB: అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని సీజ్ చేసినట్లు రూరల్ టౌన్ SHO శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. కోరుట్ల నుంచి నిజామాబాద్‌కు అక్రమంగా ఇసుక తరలిస్తుండగా కంఠేశ్వర్ బైపాస్ వద్ద లారీని ఆపి తనిఖీ చేయగా ఎలాంటి పత్రాలు లేకపోవడంతో లారీని సీజ్ చేసి స్టేషన్‌కు తరలించినట్లు ఆయన చెప్పారు. విచారణ చేపట్టి నలుగురుపై కేసు నమోదు చేశామని వెల్లడించారు.