RCBకి ఢిల్లీ హైకోర్టు షాక్!

RCBకి ఢిల్లీ హైకోర్టు షాక్!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. SRH ప్లేయర్ ట్రావిస్ హెడ్ నటించిన ఉబర్ మోటో ప్రకటన తమను కించపరిచేలా ఉందని RCB పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఇది క్రికెట్‌కు సంబంధించిన ఫన్నీ ప్రకటన మాత్రమే అని పేర్కొంది. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని ఆ పిటిషన్‌ను కొట్టివేసింది.