నంద్యాల ఫిజియోథెరపిస్టుకు జాతీయస్థాయి పురస్కారం
NDL: జిల్లా ఫిజియోథెరపిస్టుల సంఘం కార్యదర్శి డా. శివ బాలి రెడ్డి జాతీయస్థాయి పురస్కారాన్ని అందుకున్నారు. వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన ఈ గౌరవాన్ని పొందారు. సదస్సులో సమర్పించిన పరిశోధన పత్రానికి గాను ఆయనకు ఉత్తమ వైజ్ఞానిక పరిశోధన పత్రం పురస్కారం లభించింది. దీంతో పలువురు ప్రముఖులు శివను అభినందించారు.