VIDEO: నాటు సారా నిర్మూలనే లక్ష్యంగా నవోదయం 2.0

కోనసీమ: జిల్లాలో నాటు సారా నిర్మూలనే లక్ష్యంగా నవోదయం 2.0 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు. ఈ మేరకు ఆయన అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ప్రోహిబిషన్, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన నవోదయం 2.0 గోడపత్రికను ఆవిష్కరించారు. నాటు సారా తాగడం వలన కలిగే అనర్థాలను తెలియజేస్తూ అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.