శ్రీవారి సన్నిధిలో 'బ్యాండ్ మేళం' టీమ్

శ్రీవారి సన్నిధిలో 'బ్యాండ్ మేళం' టీమ్

తిరుమల శ్రీవారిని 'బ్యాండ్‌ మేళం' చిత్రబృందం దర్శించుకుంది. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నిర్మాత కోన వెంకట్, నటులు హర్ష రోషన్, అవినాష్‌, నటి శ్రీదేవి స్వామివారి సేవలో పాల్గొన్నారు. రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా రూపొందిన ఈ చిత్రం మార్చి 26న విడుదల కానుంది.