'దంతాలు శరీరానికి అద్దం లాంటివి'
SKLM: నరసన్నపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం డెంటల్ కళాశాల విద్యార్థులచే దంతాలపై అవేర్‌నెస్, అవగాహన సదస్సును నిర్వహించామని ప్రిన్సిపల్ లత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దంతాలు శరీరానికి అద్దం లాంటివని తెలిపారు. దంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. అనంతరం విద్యార్థులకు ఉచితంగా దంత పరీక్షలు చేయించి ఉచిత మందులు పంపిణీ చేశారని తెలిపారు.