నేడు మండలంలో 'పనుల జాతర' ప్రారంభోత్సవాలు

నేడు మండలంలో 'పనుల జాతర'  ప్రారంభోత్సవాలు

PDPL: రామగిరి మండల పరిధిలోని 16 గ్రామ పంచాయతీల్లో ఈరోజు 'పనుల జాతర' కు సంబంధించి గ్రామ సభలు జరగనున్నాయని ఎంపీడీవో శైలజ రాణి తెలిపారు. ఈ సందర్భంగా పూర్తయిన EGS, PR పనులకు ప్రారంభోత్సవాలు, కొత్తగా మంజూరైన వాటికి శంకుస్థాపనలు చేస్తారు. అలాగే లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయనున్నారు. మొత్తం 77 పనులకు రూ.1.27 కోట్లు ఖర్చు చేస్తామన్నారు.