బత్తాయి తోటను పరిశీలించిన ఉద్యాన శాఖ అధికారి

బత్తాయి తోటను పరిశీలించిన ఉద్యాన శాఖ అధికారి

ప్రకాశం: అర్ధవీడు మండలంలోని మాగుటూరులో గల బత్తాయి తోటలను ఉద్యాన శాఖ అధికారి శ్వేత పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. బత్తాయి తోట సాగులో ఉన్న ప్రతి రైతు తప్పనిసరిగా నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. నీటి కుంటలు ఏర్పాటు చేసుకున్నట్లయితే వేసవిలో కూడా మోటర్ల ద్వారా కుంట నుంచి చెట్లకు నీటిని అందించవచ్చని ఆమె అన్నారు. సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.