కొండాపూర్‌లో అగ్ని ప్రమాదం
JGL మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రాముల వారి గుట్టకు మంటలు అంటుకొని కాలిపోవడాన్ని గ్రామస్తులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో యువకులు అగ్ని ప్రమాదాన్ని గమనించి మంటలను చాకచక్యంగా ఆర్పివేసారు. యువకుల అప్రమత్తతోనే గుట్టకు అనుకోని ఉన్న ఇళ్లకు ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.