ట్రేడింగ్ టిప్స్ నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దు: ఎస్పీ

ట్రేడింగ్ టిప్స్ నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దు: ఎస్పీ

పల్నాడు: సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ఇన్వెస్ట్‌మెంట్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కృష్ణారావు సూచించారు. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో అధిక లాభాల ఆశచూపి కేటుగాళ్లు అమాయకులను దోచుకుంటున్నారని తెలిపారు. తెలియని వ్యక్తులు ఇచ్చే ట్రేడింగ్ టిప్స్ నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దన్నారు.