నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
NTR: నందిగామ టౌన్ సెక్షన్ అనసాగరం విద్యుత్ ఉపకేంద్రం పరిధిలోని 11KV హనుమంతుపాలెం ఫీడర్‌లో విద్యుత్ లైన్ల నిర్వహణ, మరమ్మతుల కారణంగా ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మునగచెర్ల, హనుమంతుపాలెం గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. వినియోగదారుందరూ సహకరించాలని కోరారు.