ఈనెల 7న నవోదయ ప్రవేశ పరీక్ష
NLR: మర్రిపాడు మండలం కృష్ణాపురం నవోదయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 9వ తరగతి, ఇంటర్‌లో సీట్లభర్తీకి ఈనెల 7వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ పార్వతి తెలిపారు. కృష్ణాపురం నవోదయ విద్యాలయం, ఉదయగిరి, నందిపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో, దుత్తలూరు ప్రభుత్వ ఉన్నత, ఆదర్శ పాఠశాల పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.