VIDEO: మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ.. నిలిచిపోయిన నీటి సరఫరా
ASF: బెజ్జూర్ గ్రామపంచాయతీ పరిధిలోని 1వ వార్డులో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ కారణంగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. కొన్ని రోజులుగా పైపులు పగిలి నీరు వృథా అవుతుండటంతో నీళ్లు రావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేదని, తాగునీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు.