బీహార్‌లో రికార్డు.. తొలి దశలో పోలింగ్ ఎంతంటే?

బీహార్‌లో రికార్డు.. తొలి దశలో పోలింగ్ ఎంతంటే?

బీహార్ అసెంబ్లీ తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ రికార్డు స్థాయిలో నమోదైన ఓటింగ్‌తో ప్రశాంతంగా ముగిసింది. ఈ దశలో మొత్తం 64.66 శాతం పోలింగ్ నమోదైంది. 18 జిల్లాల పరిధిలోని 121 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా పూర్తయింది. రెండో దశ పోలింగ్ 122 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 11న జరగనుంది. అనంతరం ఈనెల 14న తుది ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.