53వ డివిజన్‌లో డ్రైనేజ్ పనుల పరిశీలన

53వ డివిజన్‌లో డ్రైనేజ్ పనుల పరిశీలన

KMM: నగరంలోని 53వ డివిజన్‌లో నూతనంగా ప్రారంభమైన డ్రైనేజ్ నిర్మాణ పనులను కార్పొరేటర్ పగడాల శ్రీవిద్య నాగరాజు గురువారం పరిశీలించారు. స్థానికులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న మురుగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఈ పనులు చేపట్టినట్లు ఆమె తెలిపారు. పనులను నాణ్యతతో పూర్తి చేసి, ప్రజలకు శాశ్వత ఉపశమనం కల్పిస్తామని కార్పొరేటర్ హామీ ఇచ్చారు.