ఖైరతాబాద్‌లో ఘనంగా గంగపుత్రుల తెప్పోత్సవం

HYD: ఖైరతాబాద్‌లో ఆదివారం గంగపుత్రుల తెప్పోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఏడు గుండ్ల దేవాలయం నుండి ఐమాక్స్ థియేటర్ పక్కన ఉన్న గంగమ్మ దేవాలయం వరకు మహిళలు బోనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం సంప్రదాయబద్ధంగా జరిగిందని పలువురు పేర్కొన్నారు. గంగపుత్రుల తెప్పోత్సవంలో పోతురాజుల విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి.