VIDEO: @150 ఆకారంలో విద్యార్థుల మానవహారం
JN: వందేమాతర గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పాలకుర్తిలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన విద్యార్థులు మానవహారం నిర్వహించి దేశ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులందరూ కలిసి @150 ఆకారంలో మానవహారం నిర్వహించారు. దేశం, వందేమాతర గేయం ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు తెలిపేందుకే ఈ కార్యక్రమం నిర్వహించామని పాఠశాల సిబ్బంది పేర్కొన్నారు.