సిటిజన్ ఫీడ్ బ్యాక్ గోడప్రతుల ఆవిష్కరణ

NZB: పోలీసు సేవలపై ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ స్వీకరించేందుకు రూపొందించిన క్యూ ఆర్ కోడ్ వాల్ పోస్టర్లను నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయిరెడ్డి సిబ్బందితో కలిసి శుక్రవారం ఆవిష్కరించారు. రైల్వే ఎస్పీ ఆదేశాల మేరకు రైల్వే స్టేషన్‌లో పోస్టర్లను ఆవిష్కరించామన్నారు. ఫిర్యాదులు, ఎఫ్ఐఆర్, ఈ చలాన్, పాస్ పోర్టు ధ్రువీకరణ తదితర అంశాలపై ప్రజలు క్యూ ఆర్ కోడ్ చేయవచ్చన్నారు.