అదనపు పరీక్షల నియంత్రణ అధికారిగా శ్రీవాణి

KNR: శాతవాహన విశ్వవిద్యాలయం అదనపు పరీక్షల నియంత్రణ అధికారిగా అర్థశాస్త్ర విభాగం అధిపతి శ్రీవాణి నియమితులయ్యారు. ఈ మేరకు రిజిస్ట్రార్ ఆచార్య రవి కుమార్ జాస్తి ఉత్తర్వులు జారీ చేశారు. విశ్వవిద్యాలయ కాన్ఫిడెన్షియల్ విభాగానికి అదనపు పరీక్షల నియంత్రణ అధికారిగా నియమించినందుకు ఉపకులపతి ఉమేశ్ కుమార్, రిజిస్ట్రార్ రవికుమార్‌కు కృతజ్ఞతలు చెప్పారు.