ఇరాన్‌పై దాడులు వెంటనే ఆపండి: చైనా
పశ్చిమాసియా దేశాల యుద్దంపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ స్పందించారు. అమెరికా, ఇజ్రాయెల్ ఉద్దేశపూర్వకంగా ఇరాన్‌పై యుద్ధాన్ని ప్రేరేపిస్తున్నాయని, ఇది 'అడవి చట్టం' వైపు ప్రపంచాన్ని నెట్టడమేనని విమర్శించారు. తమ సైనిక ఆధిక్యతను అడ్డం పెట్టుకుని ఇతర దేశాలపై దాడులు చేయడం ఆపాలని హెచ్చరించారు. ఐరాస భద్రతా మండలి ద్వారా శాంతి స్థాపనకు చైనా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందన్నారు.