'కూడళ్ళ అభివృద్ధికి చర్యలు చేపట్టాలి'
KRNL: నగరంలోని కూడళ్ళను ట్రాఫిక్ నియంత్రణకు వీలుగా కుదింపు, సుందరంగా తీర్చిదిద్దాలని నగరపాలక కమిషనర్ పి. విశ్వనాథ్ ఆదేశించారు. మంగళవారం ఆయన శ్రీరామ్ థియేటర్ వద్దనున్న శ్రీ బసవేశ్వర కూడలిని పరిశీలించి, చేపట్టవలసిన అభివృద్ధి పనులపై అధికారులకు పలు సూచనలిచ్చారు. ఇందులో ఆయన వెంట పలువురు అధికారులు పాల్గొన్నారు.