సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన కార్పొరేటర్ విజయశ్రీ

సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన కార్పొరేటర్ విజయశ్రీ

HNK: వరంగల్ గ్రేటర్ మున్సిపాలిటీ పరిధిలోని 63వ డివిజన్ కాజీపేట జూబ్లీ మార్కెట్‌లో గురువారం రూ 10 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను కార్పోరేటర్ విజయశ్రీ ప్రారంభించారు. జామా మసీద్, జూబ్లీ మార్కెట్ కాలనీలో సీసీ రోడ్డు పనులు లాంఛనంగా మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాలనీ పెద్దలు పాల్గొన్నారు.