రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్

ATP: జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు, జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్‌ల పరిధిలో రౌడీషీటర్లు, నేరచరిత్ర కలిగిన వారికి పోలీసులు సోమవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. నేరాలకు దూరంగా ఉండాలని, సత్ప్రవర్తనతో జీవించాలని సూచించారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.