సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వెండి నాగ పడగ బహుకరణ

సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వెండి నాగ పడగ బహుకరణ

కృష్ణా: మోపిదేవిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు వెండి నాగ పడగ బహుకరించారు. ఆదివారం అవనిగడ్డ శివారు బందలాయి చెరువు గ్రామానికి చెందిన భక్తుడు తుంగల తారకరామ కేజీ బరువు కలిగిన వెండి నాగ పడగను స్వామివారికి సమర్పించారు. దేవస్థానంలోని కార్యాలయంలో సూపరింటెండెంట్ అచ్యుత మధుసూధనరావుకు తమ విరాళం అందచేశారు.