రహదారి కోతతో స్థానికులకు ఇక్కట్లు.!

రహదారి కోతతో స్థానికులకు ఇక్కట్లు.!

బాపట్ల (మం) నందిరాజు తోట గ్రామంలో రహదారి కోతకు గురైంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలోని పంట కాలువ వెంబడి ఉన్న రోడ్డు దెబ్బతినడంతో, ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు స్థానికులు ఆ మార్గంలో ముళ్లకంపలు పెట్టారు. చోదకులు ప్రత్యామ్నాయ మార్గంలో ప్రయాణిస్తున్నారు. అధికారులు స్పందించి రోడ్డును నిర్మించాలని వారు కోరుతున్నారు.