కదిరిలో వైభవంగా గజవాహన సేవ
సత్యసాయి: కదిరిలో వెలసిన ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 11వ రోజైన సోమవారం రాత్రి స్వామివారు గజవాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ వాహన సేవను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.